అన్ని రకాల ఆకుకూరల మాదిరిగానే తోటకూరలో కూడా మంచి పోషకాలను కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూరలో మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, మాంగనీస్, ఐరన్ వంటి వాటితో పాటు పీచు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, తక్కువ క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి.
తోటకూరలో ఉండే పీచు పదార్ధం బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఇది తినటం వల్ల ఎక్కువ సమయ కడుపు నిండుగా ఉండి ఎక్కువ సార్లు ఆహరం తీసుకోవాలనిపించదు.
తోటకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
ఈ ఆకుకూరలో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచి తిన్న ఆహారం తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
ఇందులో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే అధిక రక్తపోటు సమస్యలు కూడా తగ్గుతాయి.
ఇందులో విటమిన్ ఏ తో పాటు వివిధ రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఇందులో ఉండే విటమిన్ సి.. అనేక వ్యాధులను అడ్డుకుని శరీర వ్యాధి నిరోధక శక్తినిపెంచుతుంది. రోజులో 100 గ్రాముల తోటకూరను తీసుకుంటే 716 క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది.
ఇందులో అధిక మొత్తంలో ఉండే క్యాల్షియం ఎముకల పటుత్వానికి సహాయపడుతుంది. దీంతో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.