రాగి చెంబులో నీరు తాగండి.. ఈ రోగాలను తరిమి కొట్టండి.
Phani CH
23 SEP 2024
ప్రస్తుత ఆధునిక జీవనశైలి కారణంగా మనుషుల్లో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడున్న కాలంలో వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి.
ఇది ఇలా ఉంటే పూర్వకాలంలో నుండి రాగి చెంబులో నీళ్ళు తాగటం చాలా మందికి అలవాటుగా వస్తుంది. అయితే ప్రస్తుత కాలం వారికి వాటి ఉపయోగాలు చాలా మందికి తెలియవు.
రాగిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపులో హానికరమైన బ్యాక్టీరియా, మంటను సమర్థవంతంగా ఎదుర్కోగలవు.
రాగి బాటిల్స్‌లో నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా హైపర్ టెన్షన్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.
రాగి నీళ్లు కొలెస్ట్రాల్‌ని తగ్గించగలదు. మరియు రాగి చెంబులో ఉన్న నీటిని తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు, అల్సర్లు, అజీర్ణం సమర్ధవంతంగా తగ్గుతాయి.
కిడ్నీ, కాలేయం పనితీరును మెరుగుపర్చడంలో రాగి సహాయపడుతుంది. అంతే కాకుండా జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ రాగినీళ్లను తాగితే రిలీఫ్ కలుగుతుంది. రాగి పాత్రలను నిత్యం ఉపయోగించడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది.