ఈ ఫుడ్ కాంబినేషన్స్‌తో యమా డేంజర్.. జరా భద్రం..
TV9 Telugu
09 February 2024
భోజనం తర్వాత కూల్ డ్రింక్ తీసుకుంటే అది అనారోగ్యం కలిగిస్తుంది. వీటితో గ్యాస్ మరింత పేరుకుపోతుంది.
భోజనం వెంటనే కూల్‌డ్రింక్ తీసుకుంటే అది కడుపుబ్బరం, వికారాన్ని పెంచుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇక షుగర్‌తో నిండిన సోడాతో పిజ్జా కాంబినేషన్ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తుంది. అధిక క్యాలరీలతో బరువు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.
ఇక పిజ్జాల్లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, కొవ్వులు బరువును అమాంతం పెంచేస్తాయి. సోడియం కారణంగా హృద్రోగ సమస్యల ముప్పు పెరుగుతుంది.
కూల్ డ్రింక్స్‌లో యాడెడ్ షుగర్స్, క్యాలరీలు హృద్రోగ సమస్య తీవ్రతను మరింత పెంచుతాయని అంటున్నారు వైద్యులు.
వీటిని అధికంగా తీసుకుంటే ఊబకాయం, టైప్ టూ మధుమేహం, దంత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
అధిక షుగర్‌తో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎగబాకే ప్రమాదం ఉంది. పిజ్జా, కూల్‌డ్రింక్, సోడా కాంబినేషన్‌లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉండవు.
పోషకాహార సమస్యలు తలెత్తి రోగనిరోధక వ్యవస్ధ బలహీనపడుతుంది. వీటి ద్వారా వాటర్ రిటెన్షన్‌కు దారితీసి బీపీ పెరిగే ప్రమాదం ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి