లో బీపీ నివారణ చిట్కాలు..

07 November 2023

సాధారణంగా రక్తపోటు 120/80 mmHg కంటే తక్కువగా ఉంటే అది లో బీపీ కింద లెక్క గడతారు వైద్యులు. లోబీపీ సమస్యను తేలికగా తీసుకోవద్దు.

లోబీపీ సమస్య ఉన్నవారు ఊహించకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు. గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

మైకము, అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం, గుండె దడ, శ్వాస సమస్యలు వంటి లక్షణాలు ఉంటే లోబీపీ సమస్య ఉన్నట్టు గుర్తించాలి.

డీ హైడ్రేష‌న్‌, గుండె కొట్టుకునే వేగం త‌గ్గ‌డం, గుండెలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం, విట‌మిన్ బీ12 లోపం వల్ల లోబీపీ సమస్య వస్తుంది.

అడ్రిన‌లైన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, ఆల్కహాల్‌ ఎక్కువగా తాగడం, డ్రగ్స్‌ వాడకం కారణంగా లోబీపీ వచ్చే అవకాశం ఉంది.

తీసుకునే ఆహారం, జీవనశైలిని మార్చుకోవటం ద్వారా లో బీపీ సమస్యను సులభంగా అదిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

తగినంత నీరు తాగుతూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఆల్కహాల్, పొగత్రాగడం మానేయడం ఉత్తమం.

ఆహారంలో కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకుంటూ .. తక్కువ తక్కువగా ఎక్కువసార్లు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.