పొట్టలోకి గ్యాస్ చేరాక ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. కొన్ని కొన్ని సార్లు ఛాతీలోనొప్పికి కారణమవుతుంది. దాన్నే చాలామంది గుండెపోటుగా పొరబడుతుంటారు.
ముఖ్యంగా ఆహారం తీసుకునేటప్పుడు మెల్లమెల్లగా నములుతూ మింగాలి. తినే సమయంలో గాలి మింగకుండా ఉండటం కోసం పెదవులు మూసి ఆహారాన్ని నమలాలని సూచిస్తున్నారు.
ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ నుంచి మంచి పరిష్కారం లభిస్తుందంటున్నారు.
గ్యాస్ ట్రబుల్‌తో బాధపేవాడు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, బాగా వేయించిన పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.
ఇక పొగతాగడం, మద్యం తాగే అలవాటు ఉన్నవారు గ్యాస్ ట్రుబ్ నుంచి ఉపశమనం పొందాలంటే వెంటను ఆ అలవాట్లను మానుకోవడం అన్నింటికంటే ఉత్తమం.
గ్యాస్ ట్రబుల్‌తో బాధపడేవారు ప్రతీరోజు కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగడం వల్ల ఆ సమస్య నుంచి రిలీఫ్ లభిస్తుంది.
గ్యాస్ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్, సోడాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి బీవరేజెస్‌ను వీలైనంత మేరకు తీసుకోకపోవడమే మంచిది.
గ్యాస్‌ను పెంచే కూరగాయలు, సిట్రస్ జాతికి చెందిన పండ్లను ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. వీలైనంత తగ్గించుకోవాలి.
ముఖ్యంగా బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి.