రాత్రులు హాయిగా నిద్ర పోవడానికి చిట్కాలు..

22 November 2023

నిద్ర లేకపోవడం వల్ల రోజంతా తలనొప్పి, అలసట, నిస్సత్తువ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యకరమైన నిద్రకు 10 చిట్కాలు సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రతిరోజు నిద్రపోవ‌డానికి, నిద్రలేవ‌డానికి ఒక స‌మ‌యాన్ని నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఒకవేళ పగలు నిద్రపోయే అలవాటు ఉంటే మాత్రం 30 నిమిషాలకు మించకుండా చూసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నిద్రపోయే సమయానికి 4 గంటల ముందు మద్యం తీసుకోవడం, ధూమపానం వంటి వాటికి కచ్చితంగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

నిద్రవేళకు 4 గంటల ముందు కేఫిన్‌ మానుకోవాలి. కారంగా లేదా చక్కెర కలిగిన ఆహారం తినకూడదు. తేలికపాటి చిరుతిండి వల్ల మంచి నిద్ర పడుతుందంటున్నారు.

క్రమం తప్పకుండా వర్కౌట్స్‌ చేయాలి. కాని నిద్రపోయే ముందు వ్యాయామం చేయకూడదు. నిద్రించే బెడ్‌పై సౌకర్యవంతమైన పరుపులు ఉండేలా జాగ్రత్త పడాలి.

చాలా వేడి, చల్లని వాతావరణంలో కూడా నిద్రపోలేరు కాబట్టి సరైన ఉష్ణోగ్రత ఉండేలా వెంటిలేషన్‌ అమర్చుకోవాలి.

నిద్రించే బెడ్ రూంలో సాధ్యమైనంత ఎక్కువ కాంతి పడకుండా, శబ్ధాలు రాకుండా చూసుకోవాలని అంటున్నారు నిపుణులు.