ఈ చిట్కాలతో చలికాలంలో పాదాల పగుళ్లకు చెక్..
22 November 2023
చలికాలంలో పగుళ్లు ఉన్న పాదాలకు మర్ధన చేయడం ద్వారా పాదాలకు రక్తప్రసరణ బాగా జరిగి, పాదాలు మృదువుగా తయారవుతాయి.
ఆరు టీస్పూన్ల పెట్రోలియం జెల్లీ, రెండు టీస్పూన్ల గ్లిజరిన్, రెండు టీస్పూన్ల నిమ్మరసంను కలిపి మసాజ్ చేసుకోవాలి.
వారానికి రెండుసార్లు మసాజ్ చేయడం వల్ల పాదాలు, మోచేతులు సాఫ్ట్‌గా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పాదాల వేళ్ళ మధ్యలో ఉన్న పగుళ్లలో గోరింటాకు పేస్ట్ లేదా హెన్నా పొడిని పేస్టులా చేసుకుని రాసుకోవాలి.
పేస్టు పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో పాదాలను శుభ్రంగా కడుక్కుని టవల్‌తో తుడుచుకుంటే మెరుస్తుంటాయి.
మహిళలు కాళ్లకు పసుపు పూసుకోవడం వల్ల యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటివైరల్ నుంచి రక్షణ లభిస్తుంది.
ఉల్లిపాయ రసం కాలి వేళ్ళ మధ్య మర్ధన చేయడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుందని అంటున్నారు చర్మ ఆరోగ్య నిపుణులు.
పుదీనా రసాన్ని పాదాలకు, కాలి వేళ్లకు పూసుకుని ఆరిన తర్వాత సాక్స్ ధరించడం వల్ల పాదాలకు పగుళ్లు రాకుండా ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి