చేతలు కాళ్ళల్లో చెమట ఎక్కువగా పడుతుందా.. ఇది మీ కోసమే..
31 October 2023
చేతలు, కాళ్ళల్లో చెమట ఎక్కువగా పడుతున్నవారు చేతులు, కాళ్ళని ఎప్పటికప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకోవలి.
హార్డ్ స్మెల్ సోప్స్ కాకుండా మైల్డ్ సోప్స్ వాడడం వల్ల చాలా వరకూ సమస్యను నివారించవచ్చు. అరికాళ్ళలో చెమట వచ్చే వారు మృదువైన కాటన్ సాక్స్‌లు ధరించాలి.
చేతులు, కాళ్ళు ఎక్కువగా చెమట పట్టే సమస్య ఉన్నవారు బ్లాక్ టీ వడడం వల్ల అందులో ఉండే అస్ట్రింజెంట్ లక్షణాలు అధిక చెమటని తగ్గిస్తాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ నీటిలో మిక్స్ చేసి అందులో చేతులు, కాళ్ళు 15 నిమషాల పాటు ఉంచడం ద్వారా అందులోని యాంటీ మైక్రోబియల్ గుణాలు అధిక చెమటను తగ్గిస్తాయి.
బేకింగ్ సోడా పేస్టును చేతులు, పాదాలకు అప్లై చేసి 15, 20 నిమిషాలు అలాగే ఉంచి చల్లని నీటితో వాష్ చేయడం ద్వారా ఫలితం ఉంటుంది.
నిమ్మరసంలో 2 చెంచాల నీళ్ళు కలిపి అరచేతులు, అరికాళ్ళపై రాసుకోవాలి. దాంతో అరచేతులు, అరికాళ్ళలో చెమట తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
అరచేతులు, అరికాళ్ళకి అధిక చెమటని నియంత్రించడానికి గంధపు పొడిని వాడొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గంధం, రోజ్ వాటర్‌తో మిక్స్ చేసి అరచేతులు, అరికాళ్ళకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే అధిక చెమట సమస్య నుంచి బయటపడే అవకాసం ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి