పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చెయ్యండి..

06 November 2023

జీర్ణక్రియను సాఫీగా పూర్తి చేయడంతోపాటు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే లక్షలాది మంచి బ్యాక్టీరియాలు పొట్టలో దాగుంటాయి.

రోజూ వారి కొన్ని అలవాట్లు పొట్టను అనారోగ్యం పాలు చేస్తుంటాయి. ఫలితంగా శరీరం మొత్తం అనారోగ్యం పాలవుతుంది.

రోజుకు సరిపడా నీళ్లు తాగకపోతే జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

నీరు ఎక్కువగా తాగడం వల్ల పేగుల్లో వ్యర్థాలు పేరుకుపోవు. మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉంటుంది.

స్వీట్స్‌, చక్కెర పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల పొట్ట పని తీరు దెబ్బతింటుంది. శరీరం చక్కెర స్థాయిల్లో బ్యాలెన్స్‌ అదుపుతప్పి కడుపులో మంట పుడుతుంది.

అత్యధికంగా ప్రొబయోటిక్స్‌ ఉండే అరటిపళ్లు, యాపిల్‌, ఉల్లి, వెల్లుల్లి తీసుకోవడం వల్ల పొట్ట సంబంధిత అనారోగ్యాలు దరిచేరవు.

పెరుగు, పచ్చళ్లు, ఇడ్లీ వంటి పులియబెట్టిన ఆహార పదార్థాల్లో కూడా ప్రొబయోటిక్స్‌ పుష్కలంగా లభిస్తుంది.

ఫైబర్‌ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య ఎదురుకాకుండా ఉంటుంది.

సరిగా నిద్రలేకపోయినా దీర్ఘకాలిక ఒత్తిడికి లోనవుతుంటారు. దీంతో పొట్ట సంబంధిత అనారోగ్యాలు సంభవిస్తాయని చెబుతున్నారు.