మీ పిల్లలు మానసిక ఆరోగ్యం చురుకుగా ఉండాలంటే..
06 September 2023
పిల్లలు పెరిగేకొద్దీ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చురుకుగా ఉండాలని ప్రతీ తల్లితండ్రులు ఆశ పడుతుంటారు.
చిన్న వయసులో ఆటల్లో ఎంత ఎక్కువగా పాల్గొంటారో వారి మానసిక ఆరోగ్యం కూడా అంత చురుకుగా ఉంటుందని అధ్యయనకారులు తేల్చారు.
ఆటలు ఆరోగ్యానికే కాదు పిల్లలకు ఎంటర్టైన్‌మెంట్‌గానూ, మానిసిక ఆరోగ్యం కలిగించడంలోనూ, చురుకుదనం పెంచడంలో కూడా తోడ్పడుతాయి.
ఆటల వల్ల పిల్లల్లో చక్కటి క్రమశిక్షణ, పట్టుదల, సాధించాలనే కార్యదీక్ష, సమయస్ఫూర్తి, ఐకమత్యం వంటి గుణాలు అబ్బుతాయి.
ఆటలంటే శరీరానికి వ్యాయామాన్ని, మెదడుకి ఆలోచనా శక్తిని పెంచే ఆటలే కానీ కంప్యూటర్ దగ్గర కూర్చుని ఆడేవి ఆసలు ఆటలే కాదు.
వీడియోగేమ్స్, కంప్యూటర్ గేమ్స్ కాకుండా రోజుకు కనీసం ఓ ఆరగంటైనా పిల్లలు మైదానంలో ఆటుల ఆడేలా చూడాలి.
ఆటల వల్ల పిల్లల్లో ఆశావహదృక్పథం అలవాటు అవుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు, కాలేయం, గుండె పనితీరు బాగుంటుంది.
ఆటలు ఆడటం వల్ల పిల్లల్లో కొత్త కొత్త స్నేహితులు పుట్టుకొస్తారు. సర్దుకుపోయే తత్వం అలవాటు అవుతుంది. జయాపజయాలు పరిచయం అవుతాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి