చలికాలంలో మరికొద్ది రోజుల్లో చలితో పాటు కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఊపిరితిత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
నిర్ధిష్ట ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా చలికాలంలో శ్వాసపై ధ్యాస నిలిపే ప్రాణామాయం, యోగాసనాల అభ్యాసం చేయాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చలికాలంలో వచ్చే పండుగలను పూర్తిగా ఆస్వాదిస్తూనే ఊపిరితిత్తుల పట్ల పలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు.
తరుచు సమతుల ఆహారంతో పాటు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్‌తో కూడిన ఆహారం క్రమం తప్పకుండా అలవర్చుకోవాలి.
ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడం ద్వారా ఊపిరితిత్తుల వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఒత్తిడిని విటమిన్ సీ, ఈ లతో కూడిన ఆహార పదార్థాలు సాయపడతాయి.
చలికాలంలో లంగ్స్‌ను పదిలంగా ఉంచుకునేందుకు యాంటీఆక్సిడెంట్స్, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, స్పైసెస్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి.
తగినంత నీరు తీసుకుంటూ షుగర్ డ్రింక్స్‌కు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు, పాల పదార్ధాల, కెఫిన్, ఆల్కహాల్, స్మోకింగ్‌కు వంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయడం బెటర్.