ప్రపంచంలో 50 అతిపెద్ద బీమా కంపెనీల జాబితాలో 4వ స్థానంలో LIC
12 December 2023
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్లు చూస్తూ కదలకుండా ఒకేచోట కూర్చొని ఉండటం వల్ల ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంది.
ఈ అలవాటు మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వీటన్నింటి నుంచి రక్షించాలంటే పిల్లలను స్మార్ట్‌ఫోన్ నుంచి దూరం చేయాలి. ఇంట్లో పెద్దలు ఏం చేస్తే పిల్లలు కూడా అదే ఫాలో కావడం చేస్తుంటారు.
పిల్లల ముందు తల్లిదండ్రులు, పెద్దలు స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్ వంటివి చూడటం తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.
ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టడం వల్ల మొబైల్ చూస్తూ తినే అలవాటు దూరం అవుతుంది. పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ వంటకాలు ఎలా ఉన్నాయో అడగాలి.
పిల్లలకు కబుర్లు చెబుతూ, జోకులేస్తూ, సరదాగా గడిపితే మొబైల్ ఫోన్ చూపించి తిండి తినిపించాల్సిన అవసరం రాదు.
చిన్నప్పటి నుంచి మీ పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయడం వల్ల వారి దృష్టి స్మార్ట్‌ఫోన్ పైకి మళ్లదు.
చుట్టుపక్కల పిల్లలతో ఆటలు ఆడటం అలవాటు చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు మీ పిల్లలు బానిసలు కాకుండా ఉంటారు.