పాలు పాలలో నీరు కలిపారో లేదో తెలుసుకోవడం చాలా సులభం.. ఏటవాలుగా ఉన్న ప్రాంతంపై ఒక చుక్క పాలు వేయండి.
స్వచ్ఛమైన పాలు అయితే పాల చుక్క నెమ్మదిగా తెల్లటి గీతను వదిలి ముందుకు కదులుతుంది. అదే నీరు కలిసినవి వేసిన వెంటనే జర్రున జారుతూ కిందకు చేరుకుంటాయి.
పాలను స్టార్చ్ లాడిన్ ద్రావణంలో ఒక చుక్క పాలు వేయండి.. అవి నీలం రంగులోకి మారితే.. పాలల్లో పిండి కలిపినట్లు లెక్క.
ఒక చుక్క పాలను తీసుకుని యూరియా ఒక టెస్ట్ ట్యూబ్లో వేయండి.. దానిలో కొంచెం పసుపుని వేయండి.. తర్వాత బాగా కలపండి.
కొంచెం సేపటి తర్వాత ఆ పాలకు ఎరుపు లిట్మస్ కాగితాన్ని జోడించండి. ఈ కాగితం నీలం రంగులోకి మారితే, పాలలో యూరియా కలిసిందని అర్ధం.
సింథటిక్ పాలు చేదుగా ఉంటాయి. ఈ పాలను తీసుకుని చర్మంపై రుద్దితే.. సబ్బు రుద్దిన ఫీలింగ్ వస్తుంది. ఈ పాలు వేడి చేసిన తర్వాత పాలు పసుపు రంగులోకి మారుతాయి.
డిటర్జెంట్ 5 నుండి 10 మి.లీ పాలలో సమానమైన నీటిని బాగా కలపండి. ఈ మిశ్రమంలో ఎక్కువ నురుగు వస్తే.. ఆ పాలల్లో డిటర్జెంట్ కలిపినట్లు లెక్క.
ఇక కల్తీ పాలను గుర్తించడానికి ప్రస్తుతం షాప్స్ లో యూరియా స్ట్రిప్ దొరుకుతున్నాయి. వీటి సాయంతో పాలలో కృత్రిమ ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు.