మంచి ఇమ్యూనిటీ సొంతం కావాలంటే.!

01 నవంబర్ 2023

ఈ ఉరుకుల ప‌రుగుల జీవితంలో వ్యాధుల బారిన‌ప‌డ‌కుండా ఉండాలంటే కచ్చితంగా మెరుగైన ఇమ్యూనిటీని సొంతం చేసుకోవాలి.

అనారోగ్యాలు, ఇన్ఫెక్ష‌న్స్ ద‌రిచేర‌కుండా రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్ధ మాత్రమే మ‌న‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిలుస్తుంది.

ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ఆహార‌పు అల‌వాట్లు మార్చుకోవ‌డంతో పాటు ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని అనుస‌రించాలి

మన ప్రస్తుత లైఫ్‌స్టైల్‌ మార్పుల‌తో పాటు ఆరోగ్య‌క‌ర ఆహారం తీసుకోవడంతో ఇమ్యూనిటీని పెంపొందించుకోవ‌చ్చు.

అనారోగ్యాలు, ఇన్ఫెక్ష‌న్ల‌తో పోరాడి మ‌న‌ల్ని ఆరోగ్యం ఉంచ‌డంలో ఇమ్యూనిటీ అందించే సహకారం అంతా ఇంతా కాదు.

మెరుగైన రోగ‌నిరోధ‌క వ్య‌వస్ధ‌ను సొంతం చేసుకోవాలంటే పండ్లు, కూర‌గాయ‌లు తినండి. శారీర‌కంగా చురుగ్గా ఉండాలి.

ఆరోగ్య‌క‌ర‌మైన బ‌రువు, కంటినిండా నిద్ర‌, స్మోకింగ్‌కు దూరంగా, మ‌ద్య‌పానానికి బ్రేక్‌ ఇచ్చి, ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది.

మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యా దరిచేరవని నిపుణులు అంటున్నారు.