మోషన్ సిక్‌నెస్‌కు చెక్‌ పెట్టే చిట్కాలపై ఓ లుక్‌ వేద్దాం

12 September 2023

కొందరికి బస్సు పడదు, మరికొందరికి కారు పడదు, ఇంకొందరికి విమానం పడదు. ఎక్కితే చాలు వికారం మొదలై వాంతులు అయిపోతాయి.

కొంతమంది ప్రయాణం అంటే భయపడిపోయే పరిస్థితుల్లో ఉంటారు. ఇలాంటి వారి కోసమే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

మోషన్ సిక్‌నెస్‌ వల్ల ప్రయాణిస్తున్నప్పుడు పొట్టలో తిప్పినట్టు అయి వాంతులు అవుతాయి. వీటిని తగ్గించే చిట్కాలు పాటిస్తే ప్రయాణాల్లో వాంతులు అయ్యే అవకాశం తగ్గవచ్చు.

ప్రయాణానికి ముందు ఏమీ తినకుండా ఉండాలి. నిమ్మకాయను చేత్తో పట్టుకొని దాని వాసన పీలుస్తూ ఉంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది.

పుల్లని రుచి ఉండే చాక్లెట్లను నోట్లో పెట్టుకుని చప్పరించడం మంచిది. అలాగే అల్లం రుచి కూడా వాంతులు, వికారాన్ని తగ్గిస్తుంది.

ట్రావెల్ సిక్ నెస్ ఉన్నవారు ప్రయాణ సమయంలో దృష్టిని మరల్చాలి. ఇష్టమైన సంగీతం వినడం, సినిమా చూడడం వంటివి చేయాలి.

సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. కొద్దిగా కిటికీలు తెరిచి ఉంచి బయటి గాలి కాస్తయినా లోపలికి వచ్చేలా చూసుకోవాలి.

ప్రయాణ సమయంలో చూయింగ్ గమ్ నమలడం ద్వారా కడుపులో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇలా మోషన్ సిక్‌నెస్ సమస్య ఉన్నట్టు అంచనా.