శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ఆహార, వ్యాయామ నియమాలు పాటించడమే అత్యున్నత ప్రయత్నన్నమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మనం ఉండాల్సిన దానికంటే కొద్దిగా బరువు ఎక్కువగా ఉన్నా బాడీలో కొలెస్ట్రాల్ మోతాదులు ఆమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ముందుగా బరువును అదుపులో ఉంచుకోవాలనేది నిపుణుల సూచన. బరువును అదుపులో ఉంచుకున్నంత వరకు కొలెస్ట్రాల్ ముప్పు ఉండదు
వారానికి కనీసం 150 నుంచి 200 నిమిషాల వరకు ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మన బరువు అదుపు దాటి వెళ్లకుండా కాపాడుకోవచ్చు.
బాడీకి ఎక్కువగా శ్రమ కలిగించే పనులు చేయాలి. నడక, పరుగు, సైకిల్ తొక్కటం వంటివి చేయడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం కలుగుతుంది.
బాడీలో కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే ప్రధానంగా చేయాల్సింది నూనె వాడకం తగ్గించుకోవాలి. ఒక వ్యక్తి నెలకు అరలీటరు కన్నా ఎక్కువ నూనె వాడకుండా జాగ్రత్త పడాలి.
కుటుంబంలో నలుగురుంటే నెలకు 2 లీటర్ల కన్నా ఎక్కువ నూనె వాడొద్దన్నమాట. చిరుతిళ్లు మానెయ్యాలి. వనస్పతి వంటి ట్రాన్స్ ఫ్యాట్స్‌కు దూరంగా ఉండాలి.