ఇలా చేస్తే వర్షా కాలంలో మలబద్ధక సమస్యకి చెక్..

TV9 Telugu

20 July 2024

మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల త్వరగా ఆహారం జీర్ణం అవుతుంది.

దీంతో వ్యర్థాలు, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే ఫ్రూట్స్, కూరగాయలు, తృణ ధాన్యాలు తీసుకుంటూ ఉండండి.

వర్షా కాలంలో మల బద్ధకం సమస్య ఉన్నవారు ఎక్కువగా వేడి నీళ్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. దీంతో మల బద్ధకం సమస్య తగ్గుతుంది.

ఈ సీజన్‌లో చాలా మంది నీటిని తక్కువగా తీసుకుంటారు. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణం అవ్వద్దు. కాబట్టి నీటికి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

అదే విధంగా ఉదయం బ్రష్ చేసిన తర్వాత నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల స్టూల్ మూమెంట్ పెరుగుతుంది.

మల బద్ధకం సమస్యను తగ్గించడంలో నెయ్యి ఎంతో చక్కగా పని చేస్తుంది. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.

బ్యూట్రిక్ యాసిడ్ వల్ల ప్రేగుల్లో మెటబాలిజం ఎక్కువగా వృద్ధి చెంది స్టూల్ మూమెంట్ పెరుగుతుంది. రాత్రి పూట తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మలబద్ధకం సమస్య ఉన్నవారు అవిశె గింజలు తీసుకుంటే.. స్టూల్ మూమెంట్ బాగా పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.