పని మధ్యలో నిద్ర వస్తోందా? చెక్‌ పెట్టండిలా!

TV9 Telugu

30 January 2025

నైట్ షిఫ్ట్ కారణంగా లేదా రాత్రిళ్ళు నిద్ర లేకపోవడం వల్ల కొందమందికి పని చేస్తున్న సమయంలో నిద్ర వస్తుంది.

పని వేళలో నిద్ర వస్తే ఎంత చిరాకుగా ఉంటుందో కదా! ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు నిపుణులు కొన్ని టిప్స్‌ సూచిస్తున్నారు

రోజంతా మగతగా ఉంటే వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. మధ్యాహ్న భోజనం లైట్‌గా తీసుకుంటే శరీరం పనిచేసేందుకు సహకరిస్తుంది.

రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. వీలైనంత తొందరగా రాత్రి భోజనం చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి.

ఏ ఆహారం అయినా సరే.. లేట్‌ నైట్స్‌ తినొద్దు. ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడుపుతూ అవసరానికి మించి స్క్రీన్‌లకు అతుక్కుపోకండి.

మంచి నిద్ర కావాలంటే రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్‌ చేసుకోండి. పడుకునే ముందు గాడ్జెట్స్‌ పక్కన పెడితే నిద్ర బాగా పడుతుంది.

కాఫీ, టీల్లో ఉండే కెఫిన్‌ నిద్రను దూరం చేస్తుంది. రాత్రి భోజనం తర్వాత కాఫీ, టీలు తాగకూడదు. రాత్రి పడుకునే ముందు పుస్తకం చదవటం అలవాటు చేసుకోండి.

ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యం. పసుపు కలిపిన పాలను నిద్రపోయే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుంది.