నుదుటిపై మొటిమల సమస్య ఉందా.? ఇది మీ కోసమే..

TV9 Telugu

22 July 2024

నిమ్మరసంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నుదురు మొటిమలకు చికిత్స చేయడమే కాకుండా మళ్లీ రాకుండా నివారిస్తుంది.

కలబందలో సాలిసిలిక్ యాసిడ్, సల్ఫర్ ఉన్నందున మొఖంపై ఉన్న మొటిమలను వదిలించుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి.

దీని కోసం తాజా కలబంద గుజ్జు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి మొటిమల మీద రాసి కొంత సమయం తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా కొన్ని వారాల పాటు చెయ్యాలి.

ఒక టేబుల్ స్పూన్ నీటిలో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ తో మొటిమల మీద అప్లై చేస్తే సమస్య దూరమవుతుంది.

ఒక ఐస్ క్యూబ్‌ను గుడ్డలో చుట్టి నుదుటిపై మృదువుగా మర్దన చేస్తే మొటిమల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

నుదుటిపై మొటిమల సమస్య నుంచి బయటపడేందుకు కాఫీ స్క్రబ్ కూడా మంచి ఎంపిక అంటున్నారు వైద్యారోగ్య నిపుణులు.

కాఫీ పొడితో మీ ముఖాన్ని స్క్రబ్ చేస్తే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను దూరం చేయడంలో సహాయపడతాయి.

చర్మం ఆరోగ్యంగా, మొటిమలు లేకుండా ఉండటానికి చర్మంపై విటమిన్-ఎ, గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించండి.