పెదాలు పగులుతున్నాయా..!
TV9 Telugu
07 November 2024
చలికాలంలో పెదాలు పగలడం సర్వ సాధారణం. నివారణ కోసం చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అవుతుంటాయి. ఈ చిట్కాలు ట్రై చెయ్యండి.
చలికాలంలో పెదాలు పొడిగా మారి పగిలి ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కోసారి లిప్‌బామ్ కూడా పని చేయదు. ఇంట్లో ఉండే వాటితో సరిచేయవచ్చు
చలికాలంలో దాహంగా లేకపోయినా రెండు గంటలకోసారి కనీసం గ్లాసు నీళ్లు తాగాలి. పేరిన నెయ్యి, వెన్న, కొబ్బరినూనె రాస్తుంటే పొడి బారకుండా ఉంటాయి.
చెంచా చొప్పున పంచదార, తేనె, బాదం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని రుద్దితే పెదాలపై మృత కణాలు తొలగి పగుళ్లు పోతాయి.
పొడిబారిన పెదాలను నాలుకతో మాటిమాటికి తడపకూడదు. గులాబీ రేకులను పాలలో నానబెట్టి, మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని పెదాలకు పట్టించాలి
తరచూ కొబ్బరినూనె, కొత్తిమీర రసం లేదా బీట్‌రూట్ రసం రాస్తుంటే పెదాలు సహజసిద్దంగా ఎరుపు రంగులోకి మారతాయి.
రెండు చెంచాల తేనె, ఒక చెంచా దానిమ్మ రసం కలిపి ఫ్రిజ్‌లో అరగంట ఉంచి పెదాల మీద రుద్దాలి తరచూ చేస్తుంటే పగుళ్లు తగ్గుతాయి
5 చెంచాల నిమ్మ రసానికి 1 చెంచా గ్లిజరిన్ కలిపి రాత్రి పడుకునే ముందు పెదాలకు రాయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి
ఇక్కడ క్లిక్ చెయ్యండి