చలికాలంలో చర్మం పొడిబారుకుండా ఉండాలంటే..

02 November 2023

చలికాలంలో వాత దోషంలో అసమతుల్యత కారణంగా.. పొడి చర్మం సమస్య ఎదురవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

చలి కారణంగా బాగా వేడి నీటితో స్నానం చేయడం, స్ట్రాంగ్‌ సబ్బులు వాడటం వల్ల కూడా పొడి చర్మం సమస్య ఎదురవుతుంది.

చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు తెలిజేస్తున్నారు.

శీతాకాలంలో తినే ఆహారంలో.. నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె చేర్చుకోవడం వల్ల చర్మం లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది.

అల్లం, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలతో కూడాన హెర్బల్‌ టీలు తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగి, శరీరం ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉంటుంది.

చర్మం హైడ్రేట్‌గా ఉండాలంటే స్నానం చేసే ముందు నువ్వులు, బాదం, కొబ్బరి వంటి నూనెలతో బాడీని మసాజ్‌ చేసుకుంటే ఫలితం ఉంటుంది.

స్ట్రాంగ్‌ కెమికల్‌తో కూడిన సబ్బులను దూరంగా పెట్టాలి. వేప, కలబంద, పసుపు వంటి సహజ పదార్థాలు ఉన్న హెర్బల్‌ సబ్బులను ఉపయోగించాలి.

రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. తాగే నీళ్లలో అల్లం, దాల్చిన చెక్క, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు వేసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.