స్వీట్ తినకుండా ఉండలేకపోతున్నారా?

17 September 2024

Battula Prudvi 

కొంతమంది తీపి పదార్థాలను చూస్తే చాలు.. తినకుండా ఉండలేరు. అర్ధరాత్రి వేళ ఆకలేసినా సరే.. ఏదో ఒక స్వీటును కడుపులో వేసేస్తుంటారు.

చాలా మంది ఒత్తిడిలో స్వీటో, ఐస్‌క్రీమో తినేస్తున్నారు చాలా మంది తమకు తెలియకుండానే ఇలా స్వీట్ల మాయలో పడిపోతున్నారు

ఈ అలవాటు అనారోగ్యాలకు దారితీస్తుందని తెలిసినా సరే నియంత్రించుకోలేకపోతుంటారు! ఇలాంటి వారికి నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు.

ముందుగా ఇంటికి స్వీట్లు తెచ్చిపెట్టుకోవడం మానేయాలి. ఒకవేళ ఇంట్లో స్వీట్లు ఉన్నా ఎదురుగా కనిపించకుండా పెట్టుకోవాలి.

తీపి రుచి చూడాలనే కోరిక ఆగకపోతే.. స్వీట్​ను ముక్కలు చేసి, అందులోంచి చిన్న ముక్క చేసి తినండి. మిగిలింది ఇతరులకు ఇవ్వండి.

గులాబ్‌జామ్‌, మోతీచూర్‌ లడ్డూ లాంటి ఎక్కువ పాకం ఉన్న స్వీట్లు కాకుండా.. రసమలై, బొరుగుల ఉండ, రాజ్‌గిరా చిక్కీ వంటివి తినండి.

రాగి, నువ్వుల లడ్డూలు, తక్కువ తీపితో స్వీట్లను తయారు చేసుకుని తినండి. తక్కువ మొత్తంలో డ్రైఫ్రూట్స్‌ని కూడా ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు.

ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యల రాకుండా ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.