చ‌లికాలంలో విట‌మిన్ డీ కోసం చిట్కాలు..

TV9 Telugu

17 January 2024

వారానికి క‌నీసం రెండుసార్లు 10 నుంచి 30 నిమిషాల పాటు శ‌రీరానికి సూర్య‌రశ్మి సోకేలా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

చ‌లికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో శరీరానికి నేచురల్‌గా లభించే విట‌మిన్ డీ కావాల్సినంతా లభించదు.

శ‌రీరం క్యాల్షియ‌మ్‌, ఫాస్ప‌ర‌స్‌ను గ్ర‌హించే శ‌క్తిని కోల్పోవ‌డంతో ఎముక‌లు, కండ‌రాల నొప్పులు బాధిస్తుంటాయి.

చ‌లికాలం సమయంలో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయే క్ర‌మంలో ప్రజలు బ‌య‌టి వాతావ‌ర‌ణంలో గ‌డిపే స‌మ‌యం త‌గ్గుతుంటుంది.

దీంతో శరీరంలో విట‌మిన్ డీ లెవెల్స్ త‌గ్గుతాయి. విట‌మిన్ డీతో ఎముక‌ల బ‌లోపేతంతో పాటు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

గుండె, కిడ్నీల‌ను కాపాడేలా కండ‌రాల‌ను ప‌టిష్టం చేసేందుకు విటమిన్‌ డీ అవసరం. అధిక స‌మ‌యం ఇంటిప‌ట్టునే ఉండేవారు స‌హ‌జ‌మైన వెలుగు ప‌డేలా విండోస్ వ‌ద్ద ఉండేలా చూసుకోవాలి.

దైనందిన జీవితంలో చలికాలం సమయంలో ఉదయం పూట సూర్యరశ్మిలో వ్యాయామం చేస్తే విటమిన్‌ డీ పుష్కలంగా అందుతుంది.

ఇక గుడ్డు, పోర్టిఫైడ్ డైరీ ఉత్ప‌త్తులు, చేప‌లు, మ‌ష్రూమ్స్ వంటి ఆహార పదార్థాల్లో విట‌మిన్ డీ పుష్క‌లంగా దొరుకుతుంది. విట‌మిన్ డీ స‌ప్లిమెంట్స్‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాలి.