ఈ కూరగాయలతో కాలేయని కొండంత అండ..

TV9 Telugu

03 July 2024

బ్రోకలీలో సల్ఫర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాలేయంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి ఈ కూరగాయ బాగా సహయపడుతుంది.

అంతేకాకుండా బ్రోకలీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కూడా మంచిదని చెపుతున్నారు పోషకాహార నిపుణులు.

క్యాబేజీలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సిలతో పాటుగా మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, సల్ఫర్ లు అధికంగా ఉంటాయి.

క్యాబేజీలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్ బి5, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్, ఐరన్, క్యాల్షియం లాంటివి కాలీఫ్లవర్ లో అధికంగా ఉంటాయి.

కాలీఫ్లవర్ లో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని ఇది తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

బీట్ రూట్ లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. బీట్ రూట్ లో నైట్రేట్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కూడా కలిగి ఉంటుంది. బీట్ రూట్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుందని అంటున్నారు నిపుణులు.