అల్పాహారంలో అరటిపండ్లు తీసుకోవడం వల్ల ఈ సమస్యలు దూరం..

TV9 Telugu

07 January 2024

ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారంలో అరటిపండ్లు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అరటిపండ్లలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు.

అరటిపండులో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల కడుపు నిండిన ఫీల్ ఎక్కువసేపు ఉంటుంది. ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అరటిపండ్లలో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా అరటిపండ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.

అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్, నేచురల్‌ చక్కెరల కారణంగా తక్షణ శక్తిని అందిస్తాయి. ట్రెప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అరటిపండ్లలో పొటాషియం, విటమిన్-సి, విటమిన్-బి6, డైటరీ ఫైబర్ వంటి విటమిన్లు, ఖనిజాలు అధికంగా లభిస్తాయి.

ఉదయాన్నే అల్పాహారంలో అరటిపండ్లు తీసుకుంటే మంచి ఉత్సాహంతో రోజంతా గడుపుతారు. దీనిలో సహజ చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా విడుదల కావడానికి సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా అల్పాహారంగా తీసుకుంటే గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు.