కుటుంబం ఆరోగ్యంగా ఉండడంలో వంటగది కీలక పాత్ర పోషిస్తుంది.ప్రస్తుత రోజుల్లో చాలా మంది కిచెన్ శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
మీరు తీసుకునే ఆహారం కలుషితంగా మారడంలో సింక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అది శుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది.
మీకు తెలియకుండానే కూరలు, ఇతర పదార్థాల్లోకి చేరతుంది. ఎప్పటికప్పుడు వంటగదిలో సింక్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి.
చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. వంటపాత్రలను శుభ్రం చేసే స్పాంజ్లు నెలల తరబడి యూజ్ చేస్తుంటారు. కానీ, అది మంచిది కాదు.
ఎందుకంటే అవి బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి తరచుగా వాటిని మార్చడం ముఖ్యం. దీంతో ఎలాంటి సమస్యలు ఉండవ్.
కిచెన్‌లో కూరగాయలను కట్ చేయడానికి యూజ్ చేసే కత్తుల పై పురుగులు, కీటకాలు తిరుగుతుంటాయి. కడగకుండా అలాగే యూజ్ చేస్తే ఆరోగ్య సమస్యలు రావొచ్చు.
మరో పొరపాటు ఏంటంటే.. రిఫ్రిజిరేటర్‌ను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం. ఫలితంగా బ్యాక్టీరియా పేరుకుపోతుంది. స్టోర్ చేసే పదార్థాలపైకి చేరి కలుషితం చేస్తుంది.
నెలకు ఒకసారైనా ఫ్రిజ్‌ను శుభ్రం చేసుకోవాలంటున్నారు నిపుణులు. అదేవిధంగా చాలా మంది ఫ్రిజ్‌ను సరైన ప్లేస్‌లో ఉంచరు. అది కూడా కిచెన్‌లో ఇబ్బందిగా మారుతుంది.