రాత్రి వేళ నిద్రపట్టడం లేదా..? ఇవి తింటే వెంటనే నిద్ర మత్తులోకే..

06 April 2024

Shaik Madar Saheb

ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. నిద్రవేళలు తక్కువ అయితే.. ఇది దిన చర్యపై ప్రభావితం చూపుతుంది.

అందుకే.. రిలాక్సింగ్ బెడ్‌టైమ్ రొటీన్‌ను రూపొందించడం చాలా ముఖ్యం.. తినే పదార్థాలు కూడా నిద్ర నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.

మన నిద్ర నాణ్యత, వ్యవధిలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మన మొత్తం ఆరోగ్యం కోసం మనం ఏమి తింటున్నామో జాగ్రత్తగా పరిశీలించాలి.. 

చెర్రీస్ తింటే.. హాయిగా నిద్రపోవచ్చు.. దీనిలో మెలటోనిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు నిద్రపోయేలా చేస్తుంది.

కివి పండు.. విటమిన్లు సి, కె, అలాగే సెరోటోనిన్‌తో నిండిన కివి పండు నిద్ర నాణ్యత, వ్యవధిని మెరుగుపరుస్తుంది..  

అరటిపండ్లు నిద్రలేమిని నివారిస్తాయి. అరటిపండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

బాదం మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ యొక్క మంచి మూలం.. బాదం రెగ్యులర్‌గా తింటే.. నిద్ర నాణ్యతను పెంచుతుంది. 

ఓట్స్.. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లు, మెలటోనిన్‌లో పుష్కలంగా ఉన్న ఓట్స్ విశ్రాంతిని ప్రోత్సహించడానికి నిద్రలేమిని నివారించడానికి సహాయపడతాయి