09 October 2023
కరోనా కాలం నుంచి ప్రతి ఒక్కరూ తన రోగనిరోధక శక్తి బలంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే వాటిని తినేందుకు ఆసక్తిచూపుతున్నారు.
రోగనిరోధక శక్తిని దృఢంగా ఉంచుకోవడానికి ఏమి తినాలి..? రోగనిరోధక శక్తిని తగ్గించే విషయాలేంటి..? అనేవాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అనారోగ్యకరమైన ఆహారాలను తినడం వల్ల కడుపు ఆరోగ్యం క్షీణించడమే కాకుండా.. రోగనిరోధక శక్తి కూడా బలహీనపడటం ప్రారంభమవుతుంది.
పదే పదే అనారోగ్యానికి గురవుతుంటే.. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కావచ్చు. బలహీనంగా మారకుండా నిరోధించడానికి వీటటికి దూరంగా ఉండండి.
చక్కెర వినియోగం అన్ని రోగాలకు కారణం.. చక్కెర పదార్థాలు, శీతల పానీయాల వినియోగం వల్ల ఊబకాయంతోపాటు రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది.
టీ లేదా కాఫీకి అలవాటు పడటం కూడా మనల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. వీటిలో ఉండే కెఫిన్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ఆల్కహాల్ వ్యసనం ప్రాణాంతకం కూడా కావచ్చు. కాలేయం బలహీనపడటం, పొట్ట సంబంధిత సమస్యలతోపాటు రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.
ఆయిల్, స్పైసీ వస్తువులు ఎంత రుచికరంగా ఉంటాయో.. అంత అనారోగ్యానికి గురిచేస్తాయి. కడుపు బలహీనంగా మారి రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది.