ఈ కూరగాయలను మర్చిపోయి కూడా పచ్చిగా తినకండి..

13 November 2023

ఆరోగ్యంగా ఉండటానికి కూరగాయలు, పండ్లు తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి శరీరానికి కావల్సినంత పోషణను అందిస్తాయి. 

బోలెడన్ని పోషకాలు.. 

కూరగాయలు వండటం వల్ల పోషకాలు తగ్గుతాయని చాలా మంది పచ్చిగా సలాడ్ రూపంలో తీసుకుంటారు. వీటిద్వారా చాలా పోషకాలు లభిస్తాయి.

సలాడ్ రూపంలో

అయితే, అన్ని కూరగాయల మాదిరిగా.. కొన్నింటిని పచ్చిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. పచ్చిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకోండి

ఆరోగ్యానికి మంచిది కాదు.

పచ్చి బంగాళదుంపలు ఎప్పుడూ తినకూడదు. ఎందుకంటే ఇందులో సోలానిల్ అనే విష పదార్థం ఉంటుంది. పచ్చిగా తినడం వల్ల గ్యాస్, వాంతులు, తలనొప్పి, వికారం జీర్ణ సమస్యలు వస్తాయి. 

బంగాళదుంపలు

క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రకోలీ వంటి కూరగాయలను పచ్చిగా తినకూడదు. ఈ కూరగాయలలో చక్కెర కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణం కావడం కష్టం. 

క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ

బచ్చలికూర వంటి ఆకు కూరలను కొంతమంది పచ్చిగా సలాడ్ రూపంలో తీసుకుంటారు. ఇవి కిడ్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

ఆకు కూరలు..

పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఎప్పుడూ పచ్చిగా తినకూడదు. ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. 

పుట్టగొడుగులు..

పచ్చి లేదా వండని ఎర్రటి కిడ్నీ బీన్స్‌లో గ్లైకోప్రొటీన్ లెక్టిన్ అనే టాక్సిన్ అధిక స్థాయిలో ఉంటుంది. దీన్ని పచ్చిగా తీసుకోవడం వల్ల వికారం, వాంతులు మరియు విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

రెడ్ కిడ్నీ బీన్స్..