15 November 2023
మీరు తినే ప్రతి ఆహారం మీ మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే సరైన ఆహారం తీసుకోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మెదడు కణాలను ఏర్పరచడానికి కొన్ని ఆహారాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.. మెదడు కణాలను రక్షిస్తాయి.
మెదడుకు ఎలాంటి ఆహారం మంచిది..? ఏ ఆహారం తినకూడదు.. జ్ఞాపకశక్తి మెరుగుపర్చుకునేందుకు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకోండి..
బాదం మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. వాల్‌నట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో అధికంగా ఉంటుంది. ఇది వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.
బెర్రీలు జ్ఞాపకశక్తి, నైపుణ్యాలను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా మానసిక ఆరోగ్యాన్ని బలంగా మార్చి.. చురుకుగా ఉండేలా చేస్తాయి.
చేపలు మెదడు ఆరోగ్యాన్ని పెంచే ఆహారం.. ఇది మూడ్ బూస్టర్‌గా.. మంటను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మెదడు శక్తిని పెంచేందుకు చేపలు సరైన ఆహారం.
గుడ్లు జ్ఞాపకశక్తి, నైపుణ్యాలకు సహాయపడే మంచి ఆహారం. అంతేకాకుండా డార్క్ చాక్లెట్, అవకాడోలు కూడా మీ జ్ఞాపకశక్తిని బాగా పెంచుతాయి.
పసుపు యాంటీ అల్జీమర్.. ఇది మెదడు కణాలను రిపేర్ చేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ప్రతిచర్య సమయం, సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది.