17 September 2023
లవంగాలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. లవంగాలలో చాలా పోషకాలు ఉన్న మాట నిజమే కానీ లవంగాలు తినడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి.
అటువంటి పరిస్థితిలో రోజులో ఎన్ని తింటే మంచిది. లవంగాలు దుష్ప్రభావాలు ఏంటి..? లవంగాలను ఎంత పరిమాణంలో తీసుకోవాలి...?
లవంగాలు ఎక్కువగా తింటే రక్తం పలుచబడుతుందనే భయం ఉంటుంది. బ్లీడింగ్ డిజార్డర్ హీమోఫీలియాతో బాధపడేవారు లవంగాలను ఎక్కువగా తినకూడదు.
గర్భిణీ స్త్రీలు లవంగాలు చాలా తక్కువగా తినాలి. ఇది వేడిగా పెంచుతాయి. దీని కారణంగా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. వైద్యులను అడిగిన తర్వాతే తింటే మంచిది.
కొందరికి లవంగాల వల్ల కంటి చికాకు రావచ్చు. మీకు కూడా అలా అనిపిస్తే దానిని తినకండి. కంటి సమస్యల రాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
లవంగాలు ఎక్కువగా తినడం వల్ల పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతుంది. అతి ఎప్పటికీ మంచిది కాదని మన పెద్ద ఎప్పటి నుంచో చెబుతున్నారు.
శరీర బరువును బట్టి లవంగాలను తినాలని చెప్పారు. కిలోకు 2.5 మి.గ్రా లవంగాలు తీసుకోవాలి. వయోజన మానవునికి 1-2 లవంగాలు సరిపోతాయని చెప్పబడింది.