TV9 Telugu

ఈ 10 సాధారణ వ్యాధుల వల్ల మిలియన్ల మంది మరణాలు

01 March 2024

2019లో 8.9 మిలియన్ల మంది ఇస్కీమిక్ గుండె జబ్బుతో మరణించారు. ఈ వ్యాధి ప్రధానంగా ధమనులలో కొవ్వు చేరడం వల్ల వస్తుంది.

గుండె జబ్బుకు ప్రమాద కారకాలు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, ఊబకాయం, మధుమేహం అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 11% మంది స్ట్రోక్ వల్ల మరణిస్తున్నారు. మెదడు కణాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల స్ట్రోక్ వస్తుంది.

ప్రపంచ మరణాలలో 6% దీర్ఘకాలిక అబ్రస్టాక్టివ్ పల్మనరీ వ్యాధి కారణంగా సంభవిస్తాయి. ఈ వ్యాధి వాయు కాలుష్యం వల్ల వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా 2.6 మిలియన్ల మరణాలకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కారణమయ్యాయని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

కామెర్లు వంటి సాధారణ సమస్యల వల్ల 2 మిలియన్ల మంది పిల్లలు మరణిస్తున్నారు. పుట్టుకతో వచ్చే లోపాలు, తక్కువ బరువు, నెలలు నిండకుండానే పుట్టడం.

ఊపిరితిత్తుల క్యాన్సర్ 1.8 మిలియన్ల మందిని చంపుతుంది. ధూమపానం, రాడాన్ గ్యాస్ వంటి హానికరమైన పదార్థాల వల్ల సంభవిస్తుంది.

డయేరియా వ్యాధుల కారణంగా 1.5 మిలియన్ల మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.

కిడ్నీ వ్యాధుల కారణంగా 1.3 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఈ వ్యాధులు మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయి.