వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు..
15 December 2023
మీ రోజువారీ ఆహారంలో మోతాదుకు మించిన కార్బొహైడ్రేట్లు తీసుకోవడం కారణంగా నడి వయసులోనే బరువు పెరుగుతారు.
సిరి ధాన్యాలు, పండ్లు, కూరగాయలు తింటే బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. రిఫైన్డ్ ధాన్యాలు, చక్కెర కలిగిన పానీయాలతొ బరువు పెరుగుతారు.
ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్న 65 ఏండ్లలోపు వయసు ఉన్న వారిపై పరిశోధకులు పలు అధ్యయనాలు చేశారు.
వీరి నుంచి తీసుకొనే ఆహారం, జీవనశైలి, ఇతర ఆరోగ్య పలు విషయాల గురించి పరిశోధకులకు సమగ్ర సమాచారం సేకరించారు.
ఎక్కువగా రిఫైన్ చేసిన ధాన్యాలు, యాడెడ్ షుగర్స్, చక్కెర పానీయాలు తీసుకునే వారు బరువు పెరిగినట్టు గుర్తించారు.
అలాగే బఠానీలు, మొక్కజొన్న, ఆలుగడ్డలు వంటి కూరగాయలను తీసుకొనేవాళ్లు కూడా బరువు పెరిగారని గుర్తించారు.
కార్బొహైడ్రేట్లు, ఫైబర్, పండ్లు, బ్రొకోలి, క్యారెట్, పాలకూర వంటి కూరగాయలు తీసుకున్నవారు తక్కువ బరువు పెరిగారు.
మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవడానికి సిరిధాన్యాలు, పండ్లు తినడం మేలని సూచిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి