స్కిన్ హ్యాంగోవర్ సంకేతాలు ఇవే..
25 October 2023
మన శరీరంలోని అన్ని భావాలను ప్రతిబింబించే ఏకైక భాగం చర్మం. శరీరంలో ఏ సమస్య ఉంటె అది మొఖంపై అద్దంలా కనిపిస్తుంది.
అలాంటిదే స్కిన్ హ్యాంగోవర్ లేదా పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ అంటారు. దీనిలు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యమైనది ఆల్కహాల్ తాగడం.
అర్ధరాత్రి ఆల్కహాల్ తీసుకొంటే నిద్ర లేకపోవడం, స్కిన్ డీహైడ్రేషన్, కళ్ల కింద నల్లటి వలయాలు వంటి లక్షణాలు స్కిన్ హ్యాంగోవర్‌కి సంకేతాలు.
ఆల్కహాల్ లో శరీరాన్ని డీహైడ్రేట్ చేసే లక్షణం ఉన్న కారణంగా చర్మం పొడిబారి, డల్‌గా రంగు మారినట్లు కనిపిస్తే స్కిన్ హ్యాంగోవర్ కి సంకేతంగా భావించాలి.
దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక చర్మ సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్ లోని చక్కెర గ్లైకేషన్ కొల్లాజెన్ అనే ప్రక్రియను ప్రోత్సహించి ఎలాస్టిన్ ఫైబర్‌ల విచ్ఛిన్నానికి కారణమవుతుంది.
ఇది ఆండ్రోజెన్ హార్మోన్లు, సెబమ్‌ల స్రావాన్ని పెంచడం వల్ల మొటిమల సమస్య, చర్మ రంధ్రాలు పెద్దవి కావడం వంటివి సంభవిస్తాయి.
అధిక ఆల్కహాల్ కారణంగా త్వరగా వృద్ధాప్యం మొదలవుతుంది. చర్మంలో మార్పులు కారణంగా వివిధ రకాల ఉత్పత్తులను ఉపయాగించడం వల్ల మరింత తీవ్రంగా చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి