ఈ లక్షణలు ఉన్నాయా.. కాల్షియం లోపం కావచ్చు..
01 September 2024
Battula Prudvi
కాల్షియం లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్లనే కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు.
శరీరంలో కాల్షియం లోపాన్ని ఈ విధంగా గుర్తించవచ్చు. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాల్షియం లోపిస్తే జుట్టు పొడి బారిపోతుంది. అంతేకాకుండా జుట్టు నెమ్మదిగా పెరుగుతుంది. ఎక్కువగా స్ట్రెస్ ఒత్తిడికు గురవుతుంటారు.
గోళ్లు విరిగిపోవడం, దంతాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. సరిపడా కాల్షియం లేకపోతే చేతులు, కాళ్ళలో నొప్పి, కండరాల నొప్పులు తలెత్తుతాయి.
శరీరంలో కాల్షియం మరింతగా లోపిస్తే చేతులు, కాళ్ళు మొద్దుబారడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తప్పక తీసుకోవలి.
సోయాబీన్స్, సోయా పాలు వంటి సోయా ఆహార ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ ఉత్పత్తుల్లో విటమిన్ ‘డి’ కంటెంట్ కూడా ఎక్కువే.
పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలు దృడంగా మారుస్తాయి.
అలాగే గుడ్డులో ప్రొటీన్లు, క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. గుడ్లు ఎముకలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి