దేశంలోకి కరోనా కొత్త వేరియంట్.. JN.1 వేరియంట్ లక్షణాలు ఇవే..
20 December 2023
TV9 Telugu
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా కరోనా JN.1 వేరియంట్ కావొచ్చు. పోయిందీ అనుకున్న కరోనా రూపం మార్చుకుని మళ్లీ దాడి చేస్తోంది.
దేశంలోకి కరోనా కొత్త వేరియంట్ JN.1 ఎంట్రీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా చికిత్సకు సిద్ధంగా ఉండాలని దేశవ్యాప్తంగా ఆస్పత్రులకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
JN.1 వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.
దేశంలో కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల అధికారులు.
రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా దేశంవ్యాప్తంగా ప్రజలంతా జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ అధికారులు.
ప్రతి ఒక్కరు బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరిస్తున్నారు వైద్యారోగ్య అధికారులు.
మీలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని చెబుతున్నారు అధికారులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి