ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
TV9 Telugu
17 March 2024
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఖచ్చితంగా అల్పాహారం తీసుకోవలి.
అయితే ఆ బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యకరమైంది అయితే మరింత మంచిది. ఆరోగ్యాన్ని పదిలంగా అల్పాహారం ఏంటో తెలుసుకుందాం.
అరటిపండ్లు మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పవచ్చు. ఉదయాన్నే రెండు అరటిపండ్లు తినడం వల్ల మీ రోజును అదనపు శక్తితో ప్రారంభించవచ్చు.
అరటిపండ్లలోని కార్బోహైడ్రేట్లు ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ ఉత్పత్తి చేస్తుంది.
ఖర్జూరాలను తినడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించవచ్చు. కొరోనరీ హార్ట్ డిసీజ్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అధిక రక్తపోటుతో బాధ పడే వారు ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఆపిల్ తింటే చాలా మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.
బాదంపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. బాదంపప్పును పచ్చిగా కూడా తినవచ్చు. కాఫీకి ప్రత్యామ్నాయంగా బాదం పాలను తాగవచ్చు.
ఉడకబెట్టిన గుడ్లు తినటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీంతో అతిగా తినరు బరువు తగ్గేందుకు ఇదొక గుడ్ ఆప్షన్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి