ఈ గేమ్స్‌తో మెదడకు ఉత్తేజితం..
30 September 2024
TV9 Telugu
శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేసినట్లే రోజూ బ్రెయిన్ కు తగిన వ్యాయామం కల్పించాల్సిన అవసరం ఉంది.
మెదడు ఉత్తేజితం కావడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి దినపత్రికలలో వచ్చే క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తిచేయడం అలవాటుగా చేసుకోవాలి.
బ్రెయిన్ ఎక్సెర్ సైజ్ చేయడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడంతో పాటు థింకింగ్ స్కిల్స్ పెంచుకోవచ్చు.
సోషల్ మీడియాలో మునిగితేలడం కాకుండా ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న బ్రెయిన్ గేమ్స్ ఆడడం వల్ల మెమరీని మెరుగుపరుచుకోవచ్చు.
జిగ్ సా పజిల్స్ పూర్తిచేయడం, చెస్ ఆడటం, క్యారమ్స్ కూడా మెదడుకు మంచి వ్యాయామంలా ఉపయోగపడుతుందన్నారు.
కుట్లు, అల్లికలు కొనసాగిస్తూ డ్యాన్స్ అంటే ఇష్టపడే వారు ఎంచక్కా మంచి మ్యూజిక్ పెట్టుకుని సరదాగా స్టెప్పులేస్తూ మెమరీ పవర్‌ను పెంచుకోవచ్చు.
శరీర దృఢత్వానికి తోడ్పడే కసరత్తులు మెదడునూ ఉత్తేజితం చేస్తాయి. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా మెదడునూ ఫిట్ గా ఉంచుకోవచ్చు.
మొబైల్ లో కూడా క్యాండీ క్రష్, సుడుకో, 2048 లాంటి ఎన్నో బ్రెయిన్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇంస్టాల్ చేసి ఆడండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి