బోడ కాకర కాయ ఉందిగా అండగా.. చికెన్, మటన్ ఎందుకు దండగ..

TV9 Telugu

13 July 2024

బోడ కాకర కాయ ఆరోగ్యాన్నిచ్చే గుణాలు కలిగి ఉంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

శరీరంలో కండరాలు బలోపేతం చేయడంలో బోడకాకర కాయ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.

దీనిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నందున నిరోధక శక్తిని పెంపొందించడమే కాదు శరీర పోషణలోనూ సహాయపడుతుంది.

బోడ కాకర కాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళకు చాలా మంచిది. ఇది కంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఇది మొటిమలు, తామరను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దీని విత్తనాలను కూడా వంటల్లో వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

బోడ కాకర కాయలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కారణంగా నాడీ వ్యవస్థ వ్యాధులకు చికిత్సగా పనిచేస్తుంది.

ఇందులో కేలరీలు తక్కువగా ఉన్నందున బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి బోడ కాకర కాయ ప్రయోజనకరంగా ఉంటుంది.

బోడకాకర కాయలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే త్వరగా ఆకలి వేయదు. దీంతో మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.