ఒత్తిడిని అధిగమించాలంటే కొన్ని అలవాటు చేసుకోవాలి.. కొన్నింటిని వదులు కోవాలి
28 October 2023
స్ట్రెస్ సృతి మించితే శరీరం స్పందించే తీరుతో పలు ప్రతికూల ప్రభావాలకు లోనవుతున్నారు. దీనికి ఇంకా చాల కారణాలు ఉన్నాయి.
ఒత్తిడి తీవ్రతరమైతే హార్మోన్లు విడుదలవడంతో హార్ట్ రేట్ పెరగడం, బీపీ పెరగడం వంటివి తలెత్తుతున్నాయి.
స్ట్రెస్ హార్మోన్లు అధికంగా విడుదలైతే జీర్ణక్రియ, పునరుత్పత్తి, శరీర పెరుగుదలలో లోపాలు ఎదురవుతున్నాయి.
మానసిక ఒత్తిడిని శారీరక వ్యాయామంతో పాటు యోగ, ధ్యానం వంటి వాటితో అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా మానసికంగా, శారీరంకంగా ఒత్తిడికి దూరం కావడమే కాకుండా డే అంతా యాక్టివ్‌గా ఉండవచ్చు.
ప్రాసెస్డ్ ఫుడ్, రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ ఆహార పదార్థాలను దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, ప్రొటీన్స్, నట్స్, సీడ్స్ వంటి ఆహార పదార్థాలు తినాలి.
బీ విటమిన్ అధికంగా ఉండే గుడ్లు, చికెన్, లీన్ మీట్ వంటి ఆహారంతో కార్టిసాల్ పెరగకుండా జాగ్రత్తపడవచ్చు.
చియా గింజలు, అవిసె గింజలు, ఆలివ్ ఆయిల్, ఫ్యాటీ ఫిష్ వంటి ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారంతో ఒత్తిడిని అదిగమించవచ్చు.