అరటి పువ్వుతో ఇన్ని లాభాలా..?

అరటి పువ్వు గుండె రూపంలో ఉంటుంది. మన ప్రాంతంలో కొంతమంది అరటిపువ్వును ఒక కూరగాయగా పరిగణిస్తారు.

అరటిపువ్వును సలాడ్‌ గా, సూప్‌ లాగా తయారుచేసి వాడుతారు.

కొన్ని గిరిజన ప్రాంతాలలో అరటిపువ్వును ఎండబెట్టి, పొడిచేసి దానితో చపాతీలు చేసుకుంటారు.

అరటిపువ్వు తో జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరోచనము అగును.

ఇందులోని ఐరన్‌, కాల్షియం, పొటాషియం, వగైరాలు నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపి సక్రమముగా పనిచేసేటట్లు దోహదపడును.

ఇందులోని విటమిన్‌ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ది చేయును.

ఆడువారిలో బహిష్టు సమయం లో అధిక రక్తస్రావము అరికట్టడానికి ఇది పనికొచ్చును.

మగవారిలో వీర్య వృద్ధికి దోహద పడును.