విటమిన్-సీతో వృద్ధాప్యం నెమ్మది..
TV9 Telugu
10 August 2024
మానవుడి వెన్నుపాములోని ప్రత్యేక లక్షణాలున్న కొన్ని జీవకణాలు వృద్ధాప్యానికి కారణం అంటున్నారు నిపుణులు.
విటమిన్-సీ సప్లిమెంట్స్ తీసుకోవడంతో వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించవచ్చని చైనా సైంటిస్టులు చెబుతున్నారు.
దీనికి సంబంధించి కోతులపై జరిపిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని జర్నల్ నేచర్, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా కథనాలు వెలువరించాయి.
బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సైంటిస్టుల బృందాలు ‘యాంటీ-ఏజింగ్’పై 7 సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపాయి.
మనిషి వెన్నుపాములోని ప్రత్కేక లక్షణాలున్న కణజాలం వృద్ధాప్యానికి కారణమవుతున్న మోటార్ న్యూరాన్లను ఉత్పత్తి చేస్తుంది.
అత్యంత సున్నితమైన ఈ కణజాల జీవితకాలాన్ని విటమిన్-సీ పెంచిందని 10 కోతులపై సైంటిస్టులు జరిపిన పరిశోధనలో తేలింది.
ట్యాబ్లెట్ల రూపంలో విటమిన్-సీ తీసుకున్నా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించవచ్చని సైంటిస్టుల పరిశోధన అభిప్రాయపడింది.
వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుందని విటమిన్ సి సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే మాత్రం నష్టం తప్పదని కూడా అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి