సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఇవే

TV9 Telugu

11 JULY 2024

ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్‌తో మరణించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలు తెలియకపోవచ్చు.

వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కూడా కళ్ల ముందే కుప్పకూలుతున్నారు.

అయితే రాత్రుల్లో వచ్చే గుండెపోటు వచ్చేటట్లు ఉంటే ఈ  లక్షణాలు ఉంటాయి. అవేంటో  తెలుసుకుని జాగ్రత్త పడటం మంచింది.

కాళ్లు, పాదాలు, గుండెకు సంబంధించిన జన్యువుల్లో కనిపించే లక్షణాలు.. కాళ్లలో నొప్పి మరియు అసౌకర్యం.. రాత్రుల్లోకాళ్లు, పాదాలు చల్లగా మారడం.

రాత్రిపూట తిమ్మిరి, కాళ్ల మరియు పాదాలలో జలదరింపులు.. కాళ్లు, చీలమండలం లేదా పాదాలలో వాపు, గుండె ధమనుల్లో సహా పలు ఆరోగ్య సమస్యలు.

కాళ్ల మరియు పాదాలపై చర్మం రంగులో మార్పులు నీలి రంగు లేదా లేతగా మారడం.. కాళ్లను కదిలించాలి అనే కోరిక, అసౌకర్య అనుభూతులు.

ప్రధానంగా ఛాతిలో నొప్పి, ఛాతిలో అసౌకర్యం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఛాతి లేదా భుజాల దగ్గర వీపుపై భాగంలో వాపు.. చీలమండలంలో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.