వర్షాకాలంలో స్నానం మానేస్తున్నారా.. ఆ సమస్యలు మీ చెంతనే..
TV9 Telugu
23 August 2024
చలికాలం, వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. నిద్రలేవడంతో పాటు ఏదైనా పనిచేయాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది.
అయితే చలికాలంలో కంటే వర్షాకాలంలో స్నానం చేయకపోతే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలంలో స్నానం చేయడం మానేస్తే చర్మంలో మృతకణాలు పేరుకుపోతాయి. క్రమంగా ఈ మృతకణాలు ఈస్ట్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.
ఇవి శరీరంలోని ఇతర భాగాలకు మరింత వ్యాప్తి చెందుతాయి. దీని ఫలితంగా పలు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
స్నానం చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా శరీరం అంతటా వ్యాపించి దుర్వాసన వస్తుంది. ఇది కూడా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
స్నానం చేయకపోవడం వల్ల శరీరంలో వైరస్, బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతాయి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని మరింత తగ్గిస్తాయి.
ఇతర సీజన్లతో పోల్చుకుంటే వర్షాకాలంలో హెయిర్ లాస్ బాగా ఉంటుంది. వర్షంలో తడిచి ఇంటికి వచ్చి తలస్నానం చేయకుంటే ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.
వర్షాకాలంలో స్నానం మానేస్తే.. చర్మవ్యాధులు, సీజనల్ వ్యాధులు బాగా ఇబ్బంది పెడతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి తీవ్రమైన చర్మ వ్యాధులకు దారి తీస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి