నెయిల్ పాలిష్ అధిక వినియోగం.. ఆ సమస్యలకు కారణం..
TV9 Telugu
19 July 2024
నెయిల్ పాలిష్ లను ఎక్కువగా వాడితే.. అనారోగ్యం బారిన పడతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఫేమస్ డ్యూక్ అనే యూనివర్శిటీ చేసిన పరిశోధనలో నెయిల్ పాలిష్ ఎక్కువగా వాడటం వల్ల బరువు పెరుగుతారని నిర్థారణ అయింది.
నెయిల్ పెయింట్ లో ఉంటె ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనం ప్లాస్టిక్, ఫామ్ ఫర్నీచర్ కు మంటలు అంటుకోకుండా ఉండటానికి వాడుతారు.
ఎక్కువ రోజులు పాలిష్ గా ఉండేందుకు నెయిల్ పెయింట్ లోనూ దీన్ని కలుపుతారు. ఇది శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపి ఫలితంగా బరువు పెరిగేలా చేస్తుంది.
మార్కెట్లో లభించే 3 వేల రకాల నెయిల్ పాలిష్ లపై జరిపిన పరిశోధనల్లో 49 శాతం నెయిల్ పాలిష్ లో ట్రైఫెనైల్ ఫాస్పేట్ ఉంటుందని తేల్చారు.
ఇలాంటి నెయిల్ పాలిష్ లను వేసుకున్న 10-14 గంటల్లోగా టీపీహెచ్ పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు.
డైరెక్ట్ గా గోళ్లకు కాకుండా.. ఆర్టిఫిషియల్ నెయిల్స్ కి పెట్టుకుని అతికించుకుంటే దుష్ప్రభావాలు ఉండవు.
కాబట్టి.. నెయిల్ పాలిష్ ను అతిగా వాడే అమ్మాయిలూ.. ఇకనైనా వాటి వాడకాన్ని తగ్గిస్తే.. అది మీ ఆరోగ్యానికే మంచిది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి