షేప్‌వేర్ వల్ల ఆ సమస్యలు వచ్చే ప్రమాదం..

12 September 2023

శరీరం నాజూకుగా కనిపించడం కోసం ప్రతిరోజూ  షేప్‌వేర్ ధరిస్తున్నారా ఐతే హెల్త్ ప్రాబ్లెమ్స్ వెంటాడతాయి.

స్లిమ్మింగ్ బాడీ సూట్‌ల నుంచి టమ్మీ కంట్రోల్ ప్యాంటీల వరకు, చాలా మంది షేప్‌వేర్‌లపై మోజు పెంచుకుంటున్నారు. ఇది బాడీ రూపాన్ని మెరుగుపరిచి విశ్వాసాన్ని పెంచుతుంది.

కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ప్రతిరోజూ షేప్‌వేర్ ధరించడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల నుంచి ఈస్ట్ ఇన్ఫెక్షన్ల వరకు బాధించే అవకాశం ఉంది.

స్నగ్ ఫిట్ క్లాత్ మూత్రాశయంపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మూత్రాశయం, మూత్రనాళంలో బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశాన్ని పెంచుతుంది. ఇది UTIsకి దారి తీస్తుంది.

మూత్ర విసర్జన సమయంలో మంట లేదా అసౌకర్యాన్ని అనుభవిస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. చాలా బిగుతుగా ఉండే షేప్‌వేర్ చర్మంపై చికాకు, ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది.

ప్రతిరోజూ షేప్‌వేర్ ధరించడం వల్ల పొత్తికడుపు, వెనుక కండరాలపై ఒత్తిడి పడి వెన్నునొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

షేప్‌వేర్ వంటి బిగుతుగా ఉండే వస్త్రాలను ధరించడం వల్ల యోని ప్రాంతంలో తేమ, వేడి కలగవచ్చు. ఇది ఈస్ట్ వృద్ధి చెందడానికి సరైన వాతావరణం.

పొట్టపై ప్రభావం చూపుతుంది. జీర్ణవ్యవస్థ పనిచేయకుండా అడ్డుకుంటుంది. గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి అనేక రకాల జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.