పాల ఉత్పత్తులతో నిమ్మకాయను కలిపి తీసుకుంటే యమ డేంజర్‌

21 October 2023

నిమ్మకాయలను ఎన్నో ఔషధాగుణాలకు గనిగా పేర్కొంటుంటారు. నిమ్మకాయలతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

నిమ్మరసం వల్ల ఒంట్లో వేడి తగ్గిపోవడమే కాకుండా డీహైడ్రేషన్‌కు గురైన బాడీ వెంటనే హైడ్రేట్‌ అవుతుంటుంది.

పరగడుపునే నిమ్మరసంతో షర్బత్‌ చేసుకుని తాగితే కడుపులోని మలినాలు పోయి క్లీన్‌ అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలతో నిమ్మరసం కలిస్తే మాత్రం ఆ ఆహారం విషంగా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

పాలు, నిమ్మరసం ఒకేసారి తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, వాంతులు అవడం లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయంటున్నారు.

మసాలతో చేసిన వంటకాల్లో కూడా నిమ్మరసాన్ని ఉపయోగించడం ఎంత మానుకుంటే అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బిర్యానీ, చికెన్ వంటి మసాలా వంటకాల్లో నిమ్మరసం కలుపుకోవడం వల్ల ఎసిడిటీ బారినపడే ప్రమాదం పొంచి ఉంటుంది.

వైన్‌లో నిమ్మ రసం కలుపుకోవడం తాగడం వల్ల వైన్ రుచిని, వాసనను చెడగొట్టడమేగాక ఆరోగ్యానికి కీడు చేస్తుంది.