ఏసీలో ఎక్కువ సేపు ఉంటున్నారా.? ఇది మీ కోసమే..
TV9 Telugu
23 February 2025
వేసవికాలమైన సరే ఎక్కువ సేపు ఏసీలో ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.
ఒక పరిశోధన ప్రకారం, ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల అలసట లేదా బలహీనత ఏర్పడవచ్చు. డీహైడ్రేషన్ వంటి సమస్యలు కూడా వస్తాయి.
ఎయిర్ కండీషన్ల చల్లదనంలో ఎక్కువ సేపు ఉండేవారికి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏసీలు గదిలో తేమను మాయం చేస్తాయి. అలాగే మన చర్మంపై చెమటను కూడా పోగొడతాయి. ఇది వైఫల్యం అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది.
ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. చర్మం డ్రై అవుతుంది. కళ్లు కూడా పొడిబారి, దురద పెడతాయి.
శ్వాసకోశ సమస్యల మొదలవుతాయి. ఈ సమస్య ఎక్కువగా ముక్కు, గొంతులో వస్తుంది. దీనితో పాటు ముక్కు మూసుకుపోవడం ప్రారంభమవుతుంది.
ఇక ఏసీలో ఎక్కువసేపు ఉండేవారికి కిడ్నీలు త్వరగా పాడైపోతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే కుంచెం జాగ్రత్తగా ఉండాలి.
అతిగా ఏసీలో సమయం గడిపేవరికి బయట వచ్చే వాతావరణ మార్పులు ప్రభావం చూపుతాయంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించిన హిందూ చక్రవర్తులు వీరే..
విమానంలో ఆటోపైలట్ మోడ్ ఎలా పని చేస్తుందో తెలుసా.?
ఇంటికి అతిథులు వస్తున్నారా.? రోజ్ కొబ్బరి లడ్డు ట్రై చేయండి..