అధిక సమయం శీతలగాలిలో గడుపుతున్నారా? అయితే యమ డేంజర్
TV9 Telugu
16 January 2024
చలిలో ఎక్కువసేపు గడపడం వల్ల శరీరంలో షాకింగ్ మార్పులు చోటు చేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
అతి చల్లని వాతావరణంలోకి వెళ్లినప్పుడు శరీరం అల్పోష్ణస్థితికి తొందరగా గురవుతుందని అంటున్నారు నిపుణులు.
చలిని అధిగమించేందుకు శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పడిపోయి వణుకు, గందరగోళం, అపస్మారక స్థితికి దారితీస్తుంది.
శరీరంలో బహిర్గతమయ్యే భాగాలపై చలి ఎఫెక్ట్ బాగా ఉంటుంది. ముఖ్యంగా ముఖం, కాళ్లు, చేతులు తిమ్మిర్లు, రంగు మారడం, కణజాలం చనిపోవడం జరుగుతుంది.
చల్లగా ఉన్న పొడి గాలులు పీల్చుకోవడం వల్ల గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. శ్వాసకోశ వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది.
ఆస్తమా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నవారికి ప్రాణాంతకంగా మారుతుంది. ఎక్కువ రోజులు ఇలాంటి వాతావరణానికి గురయితే సమస్య తీవ్రత పెరుగుతుంది.
విపరీతమైన చలి హృదయనాళ వ్యవస్థపై ఎక్కువ భారం పడేలా చేస్తుంది. శరీరం ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమ తీసుకుంటుంది.
ఇది గుండె కొట్టుకునే వేగానికి, అధిక రక్తపోటుకు దారితోస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది.