06 November 2023
ఒంటరితనం వల్ల ఎన్నో నష్టాలు..
చాలా దేశాల్లో కరోనా తర్వాత ఒంటరితనం సమస్య అనేది అధికమైంది. తనకు ఎవ్వరూ లేరనే భావన వ్యక్తిని కుంగదీస్తుంది. చివరికి మనిషిని చనిపోయేలా కూడా చేస్తుంది.
ఇతరులతో బంధాలు మెయింటైన్ చేసేవాళ్లకంటే ఒంటరితనంతో భాదపడుతున్న వారు మరణించే చాన్స్ 50% ఎక్కువ ఉంటుందట.
రోజుకు 15 సిగరెట్లు తాగితే ఎంత ప్రాణాంతకమో ఒంటరితనం అంత ప్రమాదకరమైనదని తాజాగా పరిశోధకులు వెల్లడించారు.
ఒంటిరితనం అనేది రోజువారి జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
ఒంటరితనం వల్ల తనకంటూ ఎవ్వరూ లేరనే మానసిక బాధ ఆవరించి మనిషి ఒక విధమైన చేతకాని వాడిలా మారిపోతాడని వెల్లడైంది.
క్రమేణ మంచానికే పరిమితమై ఓ భయానక రోగిలా తయారవుతాడు. ఏ వ్యాధి లేకుండానే ఏదో మహమ్మారి బారినపడ్డవాడిలా మరణించే ప్రమాదం ఉంటుంది.
నేను ఒంటరి అనే భావన మనసులో నుంచి మొదట తొలగించుకోవాలి. తనకు నచ్చినా లేదా తనంటే ఇష్టపడే వ్యక్తులతో గడుపుతూ ఉండాలి.
మీరు ఎవరితో సన్నిహితంగా ఉంటారో వారితో మంచి బాండింగ్ ఏర్పర్చుకుంటే తెలియకుండానే అన్ని సమస్యల నుంచి కోలుకుంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి